– తెలంగాణ రాష్ట్ర కళాకారులు, రంగస్థల సమాఖ్య ఉపాధ్యక్షులు దరుమూరి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ- మిర్యాలగూడటౌన్
అన్నదమ్ములుగా తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి తప్ప నాటక రంగంలో తాము ఒకే కుటుంబ సభ్యులమని, కళామతల్లి బిడ్డలమని తెలంగాణ రాష్ట్ర కళాకారుల రంగస్థల సమాఖ్య ఉపాధ్యక్షులు దరుమూరి వెంకటేశ్వర్లు అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం ఆధ్వర్యంలో మిర్యాలగూడ కళాభారతి ఆడిటోరియంలో ‘నందిని అవార్డ్స్ 2026’ జాతీయస్థాయి పద్య నాటక, సాంఘిక నాటక పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రముఖ పారిశ్రామికవేత్త పోలిశెట్టి ధనంజయతో కలిసి దరుమూరి వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రా, తెలంగాణ అన్న తారతమ్యం లేకుండా ఈ నాటిక పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు కళాభివందనాలన్నారు. ప్రదర్శిస్తున్న నాటికలు యువతరాన్ని మేల్కొల్పే విధంగా ఉన్నాయని తెలిపారు. అలాగే నాయకులకు తగిన సూచనలు అందించే విధంగా ఉన్నాయని అన్నారు. తల్లిదండ్రుల పట్ల వారి పిల్లలు అనుసరించాల్సిన విధివిధానాలను తెలియపరిచే విధంగా ఈ నాటికలు ప్రదర్శిస్తున్నారని తెలిపారు. అనంతరం శివలీలలు నాటక ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నది. ‘మోహినీ భస్మాసుర’ పద్య నాటకం అక్కినేని సాంస్కృతిక సమాజం, హైదరాబాద్కు చెందిన సిరిమువ్వ కల్చరల్ విజయనగరం ‘గేమ్’ సాంఘిక నాటిక, హైదరాబాద్కు చెందిన గోవాడ క్రియేషన్స్ ‘అమ్మ చెక్కిన బొమ్మ’ సాంఘిక నాటిక ప్రదర్శించబడ్డాయి. నాటికల అనంతరం నటీనటులకు, నిర్వాహకులకు పారితోషకంతో పాటు షీల్డ్, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు తడకమళ్ళ రామచంద్రరావు, అధ్యక్షులు రామావతారం, ప్రధాన కార్యదర్శి పులి కృష్ణమూర్తి శర్మ, కోశాధికారి వెంకట లక్ష్మీనారాయణశర్మ, సాయిలు, సత్యనారాయణచారి, లక్ష్మయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ, శ్రీనివాస రావు, రాఘవయ్య, శ్రీమతి శైలజ, సరస్వతి, శ్రీమతి నాగమణి, ఉపేందర్, బాబురావు, వీరప్రతాప్, టంగుటూరి రాజారాం తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రాలు విడిపోయినా.. మేం కలిసే ఉన్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



