Saturday, March 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి

మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి

- Advertisement -

– ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్‌ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెహ్రూనగర్‌ ఆర్‌ఎంపీ భవనంలో శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. దేశంలో ఐద్వా పోరాటఫలితంగా లైంగిక నిరోధక చట్టం, వరకట్న నిషేధ చట్టం, ఆస్తి హక్కు చట్టం, నిర్భయ చట్టం, సమాన పనికి సమాన వేతనం వంటి చట్టాలను సాధించుకున్నామని తెలిపారు. కానీ వీటిని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. మహిళలు.. విద్య, వైద్యం, క్రీడలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, రాజకీయాల్లో ముందుకు వెళుతూ తమ ప్రతిభను చాటుతున్నప్పటికీ వారిపై హింస, లైంగికదాడులు వివిధ రూపాల్లో చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇవి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పెరిగా యని తెలిపారు. మరో పక్క సమాజంలో మహిళల పట్ల వివక్షత, చిన్నచూపు, అణిచివేతకు గురిచేస్తూ మహిళను రెండో తరగతి పౌరురాలుగా చూస్తు న్నారని అన్నారు. ఇలాంటి భావజాలంలో మార్పు రావాలని, చట్టాలను పట్టిష్టంగా అమలు చేయా లని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఉచిత బస్సు మాత్రమే అమలు చేస్తున్నదని, మిగతా పథకాలూ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో మహి ళల్ని ఐక్యం చేసి ఉద్యమం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సూరం పద్మ, జవాజి విమల, ఆడెపు రజిత, గడప మాధవి, నేలపెళ్లి శ్యామల, మల్లారపు నరసవ్వ, గురజాల మమత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -