Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొదటి రోజు పది పరీక్షలు ప్రశాంతం

మొదటి రోజు పది పరీక్షలు ప్రశాంతం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో ఎస్ఎస్ సి పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్ల మధ్య శనివారం ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఒక కేంద్రం ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో ఒక కేంద్రం తెలంగాణ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో మరొక కేంద్రం మొత్తం మూడు పరీక్ష కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఈ మూడింటిలో మొత్తం 637 మంది పరీక్షలకు హాజరు కావలసి ఉండగా ఇద్దరు విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకరు ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో మరొకరు తెలంగాణ రెసిడెన్షియల్ బాలుర  పాఠశాలలో గైర్హాజరైనట్టు మండల విద్యాశాఖ అధికారి రాములు నాయక్ తెలిపారు. 250 మంది కి ఒక సెంటర్ తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో 221 మంది ఒక సెంటర్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియంలో ఒక వంద 166 మందితో మరొక సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా కొనసాగడానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు చేపడుతున్నట్లు ఎంఈఓ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -