Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్17న మండల క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు 

17న మండల క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు 

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్ లో 2026-27 సంవత్సరానికి గాను 4వ తరగతిలో ప్రవేశానికి ఎంపిక పోటీలు నిర్వహించబడునని మండల విద్యాశాఖ అధికారి జి.లక్ష్మణ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన విద్యార్థిని విద్యార్థులు https://tgss.telangana.gov.in వెబ్ సైట్ లో 17-03-2026 లోపు పేరు నమోదు చేసుకోవాలన్నారు. మండల స్థాయి ఎంపికలు 17న జిల్లా పరిషత్ తాడిచెర్లలో ఉదయం10 గంటలకు జరుగుతాయన్నారు.అలాగే ఎంపికలకు వచ్చే అభ్యర్థుల వయస్సు 4వ తరగతి కొరకు 8 సంవత్సరాల లోపు అనగా 01.09.2017 నుండి 31.08.2018 మధ్యలో జన్మించి ఉండాలని తెలిపారు.

నెక్స్ట్ఇయర్ 4వ తరగతి చదవబోతున్న విద్యార్థులు అర్హులన్నారు.రాష్ట్ర స్థాయిలో జరుగు ఎంపిక 27.04.2026 నుండి 01.05.2026 వరకు జరుగుతాయన్నారు. మండల క్రీడా పోటీలకు హాజరవు విద్యార్థిని విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు ఒరిజినల్, జిరాక్స్ కాపీ తమ వెంట తీసుకుని రావాలన్నారు. ప్రస్తుత పాఠశాల నుండి వయస్సు అండ్ స్టడీ సర్టిఫికెట్, డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్,  2 పాస్ పోర్టు సైజు ఫోటోలు ఆసక్తిగల విద్యార్థినీ విద్యార్థులు మంగళవారం ఇతర వివరాలకు సరస్వతి పిడీ ఫోన్ నెంబర్ 9000948940  సంప్రదించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -