నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన హుండీ లెక్కింపు సోమవారం నిర్వహించారు. ఫిబ్రవరి 28 నుండి మార్చి 5 వరకు జరిగిన జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యుల సమక్షంలో లెక్కించారు.
హుండీ ద్వారా రూ.1,11,281 ఆదాయం, స్వామివారి కళ్యాణం మరియు తేరు కట్నాల ద్వారా రూ.90,081 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. మొత్తం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆదాయం రూ.2,01,362గా నమోదైనట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ వేముల నరసింహారావు, ఇన్స్పెక్టర్ మదన్ కుమార్, ఈవో నరసింహులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోకురాల మోహన్ గౌడ్, ఉత్సవ కమిటీ సభ్యులు బుదుగం శ్రీనివాస్ గౌడ్, చలమల గణేష్ గౌడ్, కన్నోజ్ ప్రదీప్ ప్రసాద్, డిప్యూటీ సర్పంచ్ పానం సైదులు, జూనియర్ అసిస్టెంట్ నాగరాజు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు చలమల రామస్వామి గౌడ్, మాధవరం రాజల్ రావు, జర్పాటీ సుదర్శన్, దుడ్డు శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



