Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీబీపేటలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

బీబీపేటలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

- Advertisement -

– వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నివాళులు
– చలివేంద్రం ప్రారంభం
నవతెలంగాణ –  కామారెడ్డి,  బీబీపేట

తెలుగు రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సోమవారం బీబీపేటలోని వాసవి క్లబ్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వేసవికాలం సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షుడు మురికి శ్రీనివాస్ ఇంటి ముందు ప్రజలకు చల్లని నీరు అందించేందుకు “చలివేంద్రం”ను ప్రారంభించారు. అనంతరం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నాయకులు ఆయన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు మురికి శ్రీనివాస్, కార్యదర్శి రెడ్డిశెట్టి శ్రీనివాస్, కోశాధికారి జుర్రిగల శ్రీనివాస్, వైస్ గవర్నర్ బాసెట్టి నాగేశ్వర్, జోన్ చైర్మన్ తొడుపునూరి నాగభూషణం, ఈదుద్దల విశ్వప్రసాద్, రెడ్డిశెట్టి వెంకటేశం, నీలబైరయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -