గ్రామ పెద్దల సహకారంతో సప్త అన్నదాన విజయవంతం
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గ్రామంలో వారం రోజులపాటు అఖండ శివనామ సప్త నిర్వహించారు. సోమవారం ఆ గ్రామంలో శివాలయం వద్ద మహన్నదాన బండారం చేపట్టారు. ఆ గ్రామ పెద్దలు సప్త కార్యక్రమం కమిటీ పెద్దలైనా బసవరాజ్ పటేల్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల సహకారంతో విజయవంతమైంది. ఈ మహా అన్నదాన బండార కార్యక్రమంలో గ్రామ మహిళలు పురుషులు యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సకల సౌకర్యాలతో వారం రోజులపాటు అన్ని రకాల కార్యక్రమాలు విజయవంతం చేయడం పట్ల నిర్వాహక కమిటీ సభ్యులకు గ్రామస్తులంతా అభినందనలు తెలియజేశారు. ఈ మహన్నదాన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేష్, నిర్వాహక పెద్దలు బసవరాజ్ పటేల్, నిర్వాహక కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
పెద్ద ఎక్లారాలో మహా అన్నదానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



