జిల్లా పౌర సరఫరాల శాఖ సిబ్బంది
నవతెలంగాణ – నవాబు పేట
హోటల్లు, రెస్టారెంట్లు టీ స్టాల్ లలో డొమెస్టిక్ సిలిండర్లు వాడొద్దు అని జిల్లా పౌరసరఫరాల అధికారులు డి.టి.లు, అధికారులు అన్నారు. సోమవారం పోలీస్ శాఖ ఎస్. ఐ/ సి. ఐ లతో సంయుక్తంగా ఏర్పాటు చేసిన టీమ్ లు నవాబ్ పేట మండలంలోని వివిధ వాణిజ్య సంస్థలలో తనిఖీ లు చేశారు. ఈ తనిఖీల్లో బాగంగా డొమెస్టిక్ సిలిండర్ లను వాణిజ్య పరంగా వినియోగిస్తున్న వాణిజ్య సంస్థలపై కేసులు నమోదు చేసి, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గృహ అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ లు కొరత లేదని, సోషల్ మీడియా వాట్సప్ లో ప్రచారం చేస్తున్న వదంతులు నమ్మ వద్దని, గ్యాస్ డీలర్ దగ్గర ఆన్ లైన్, వాట్స్ అప్ ద్వారా బుక్ చేసుకోవాలని ఆయన తెలిపారు.
హోటల్స్, రెస్టారెంట్స్, టీ స్టాల్ లలో డొమెస్టిక్ సిలిండర్లు వాడొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



