Tuesday, March 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంలెబనాన్‌తో త్వరలో చర్చలు

లెబనాన్‌తో త్వరలో చర్చలు

- Advertisement -

ఇజ్రాయిల్‌ అధికారుల వెల్లడి
బీరూట్‌ :
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయిల్‌, లెబనాన్‌ మధ్య త్వరలో చర్చలు జరగనున్నాయి. ఇజ్రాయిల్‌ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. ఈ చర్చల ప్రధాన లక్ష్యం దీర్ఘకాలిక కాల్పుల విరమణను సాధించడం, సాయుధ సంస్థ అయిన హిజ్బుల్లాను నిరాయుధీకరించడమేనని సమాచారం. ఇజ్రాయిల్‌ తరఫున చర్చలకు ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుకు సన్నిహితుడైన రాయబారి రాన్‌ డెర్మర్‌ నేతృత్వం వహిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో ఫ్రాన్స్‌ కూడా పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. లెబనాన్‌ ప్రభుత్వం చర్చల కోసం ఒక ప్రతినిధి బృందాన్ని సిద్ధం చేస్తోంది. అయితే చర్చల తేదీ ఇంకా ఖరారు కాలేదు. చర్చలు ప్రారంభం కావాలంటే ముందుగా పూర్తిస్థాయి కాల్పుల విరమణ అవసరమని లెబనాన్‌ అధ్యక్షుడు జోసెఫ్‌ ఔన్‌ డిమాండ్‌ చేశారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇజ్రాయిల్‌ దాడుల కారణంగా లెబనాన్‌లోనూ మారణ హౌం జరిగింది. ఇప్పటి వరకు 800 మందికి పైగా ప్రజలు చనిపోయారు. 8 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయిల్‌, లెబనాన్‌ మధ్య జరగనున్న చర్చలు ఈ ప్రాంతంలో శాంతిస్థాపనకు ఎంతవరకు సహాయపడతాయో వేచి చూడాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -