Tuesday, March 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమధ్యప్రాచ్యంలో ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లు

మధ్యప్రాచ్యంలో ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లు

- Advertisement -

ఇరాన్‌పై దాడుల్లో అమెరికా వినియోగం
ఇప్పటికే రెండింటిని మోహరించిన యూఎస్‌
యుద్ధంలో ఇవే కీలకం
వాషింగ్టన్‌, టెహ్రాన్‌ :
ఇరాన్‌పై ఇజ్రాయిల్‌, అమెరికాలు ఏ మాత్రమూ పట్టు సాధించలేకపో తున్నాయి. యుద్ధం ద్వారా ఇరాన్‌ను దారిలోకి తెచ్చు కోవచ్చని భావించిన యూఎస్‌కు.. ఇరాన్‌ గట్టి షాక్‌లే ఇస్తోంది. దీంతో ఇరాన్‌ను భయపెట్టిం చేందుకు అమెరికా తన సాయుధ సంపత్తిని ప్రదర్శించే యత్నం చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికా తన యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌, యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌.ఫోర్డ్‌ వంటి శక్తివంతమైన ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లను మధ్యప్రాచ్యంలో మోహరించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్ల ప్రాధాన్యాన్ని ప్రపంచ దేశాలు మళ్లీ చర్చి చస్తున్నాయి. భారత్‌ కూడా ఈ శక్తివంతమైన నౌకలను కలిగి ఉన్న దేశాలలో ఒకటి. ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్యల్లో అమెరికా నౌకాదళానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లు కీలక పాత్ర పోషిస్తు న్నాయి. సముద్రంలో తేలియాడే విమాన స్థావరాలుగా పని చేసే ఈ భారీ యుద్ధ నౌకలు దూర ప్రాంతాల్లో కూడా వైమానిక దాడులు చేయడానికి సహాయపడతాయి. ప్రపంచంలో కొన్ని దేశాలకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది.

ఏమిటి ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌?
ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ అనేది సముద్రంలో తేలియాడే ఒక మొబైల్‌ ఎయిర్‌ బేస్‌ వంటిది. దీనిపై ఫైటర్‌ జెట్లు, హెలికాప్టర్లు టేకాఫ్‌, ల్యాండింగ్‌ చేయగలవు. ఇది ఒక దేశానికి దూర ప్రాంతాల్లో కూడా సైనిక శక్తిని ప్రదర్శించే అవకాశం ఇస్తుంది. ఇప్పుడు ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా చేస్తున్నది కూడా అదే. తన రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లను మధ్యప్రాచ్యంలో మోహరించి, వీటి సహాయంతో ఇరాన్‌ లక్ష్యాలపై దాడులకు దిగుతోంది. ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లను కలిగి ఉన్న బ్రిటన్‌.. తన హెచ్‌ఎంఎస్‌ ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ను, ఫ్రాన్స్‌.. చార్లెస్‌ డె గౌల్లేను మధ్యదరా సముద్రంలో మోహరించాయి.

ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లు ఉన్న దేశాలు
ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు మాత్రమే ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లను కలిగి ఉన్నాయి. ఇందులో భారత్‌తో పాటు అమెరికా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జపాన్‌, ఇటలీ, రష్యా వంటి దేశాలు ఉన్నాయి. భారత్‌ ప్రస్తుతం రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లు నిర్వహిస్తోంది. ఇందులో ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లు ఉన్నాయి. ఈ నౌకలపై ఫైటర్‌ జెట్లు, హెలికాప్టర్లు పని చేస్తాయి. ఇవి భారత నౌకాదళానికి సముద్రంలో శక్తివంతమైన రక్షణ, దాడి సామర్థ్యాన్ని ఇస్తాయి. ఇంతటి కీలకమైన ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లు చాలా ఖరీదైనవి. ఇవి ప్రపంచ రాజకీయాలు, యుద్ధాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఒక దేశం శక్తిని ప్రదర్శిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అందుకే వీటిని ‘1,00,000 టన్నుల డిప్లమసీ’ అంటారని వారు వివరిస్తున్నారు. అయితే మధ్యప్రాచ్యంలో జరుగుతున్న తాజా సంఘటనలను చూస్తే ఇది కేవలం ఒక యుద్ధ పరిస్థితి కాదనీ, ప్రపంచ రాజకీయాల్లో శక్తివంతమైన దేశాల ఆధిపత్యం ఎలా పని చేస్తుందో చూపించే ఉదాహరణ అని విశ్లేషకులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే అమెరికా తన పెద్ద సైనిక శక్తిని ఉపయోగించి ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. ఇలా భారీ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లను, సైనిక సమీకరణ చేయడం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతను మరింతగా పెంచుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అమెరికా చర్యలను బట్టి చూస్తే అవి అంతర్జాతీయ చట్టాలను, ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించడం లేవని అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -