నవతెలంగాణ – మద్నూర్
ఆత్మ సౌజన్యంతో మద్నూర్ మండల రైతులకు ఆయిల్ ఫామ్, సేంద్రియ వ్యవసాయంపై మండల వ్యవసాయ అధికారి రాజు అవగాహన కల్పించారు. ఈ క్రమంలో 125 మంది నుంచి సేకరించిన మట్టి నమూనా ఫలితాలను, మట్టి నమూనా కిట్లను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేయడం ద్వారా భూమి సారవంతంగా ఉంటుందని అన్నారు. అలాగే పురుగు, ఎరువుల వాడకం తగ్గియాలని సూచించారు.
అనంతరం ఉద్యాన అధికారి మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ సాగు లాభదాయకం ఉందని, ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని రైతులు ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి, ఉప సర్పంచ్ వట్నల్వర్ రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు, ఉద్యాన అధికారి రామకృష్ణ, హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ మేనేజర్ మోహన్ జాదవ్, ఎఫ్ పి ఓ చైర్మన్ గోపాల్, ఏఈ వో లు, సౌమ్య, సరోజ, విశాల్, సంయుక్త , మండల రైతులు పాల్గొన్నారు.



