తెలుగు ప్రేక్షకులకు సాయికుమార్ అనే పేరు పరిచయం అవసరం లేదు. ఆయన పేరు వినగానే ముం దుగా గుర్తుకు వచ్చేది గంభీరమైన గాత్రం, స్పష్టమైన ఉచ్చారణ, శక్తివంతమైన డైలాగ్ డెలివరీ. అందుకే తెలుగు చిత్రసీమ ఆయనను ప్రేమగా ‘డైలాగ్ కింగ్’ అని పిలుస్తుంది. ఇటీవలే సినీ పరిశ్రమలో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసి అరుదైన మైలురాయిని అందుకున్న సాయి కుమార్ పుట్టినరోజు నేడు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తన నటనా ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించిన ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును కొనసాగిస్తున్నారు. రవితేజ ‘ఇరుముడి’, ‘ధర్మస్థల నియోజక వర్గం’, ‘సంబరాల ఏటిగట్టు’, నాగార్జున 100వ చిత్రం, ‘వేదవ్యాస్’, కిరణ్ అబ్బవరం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం, ‘ఏమో ఏమో ఇది’, విశ్వక్ సేన్ చిత్రం, ‘లుంగీ మ్యాన్’, నితిన్-నాని ప్రాజెక్ట్, ‘ఫుల్ బాటిల్’, ‘బరి’, ‘కూర్మావతారం’, ‘సాయి బాబా’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ‘వచ్చినవాడు గౌతమ్’, ‘ఎస్‌ఐ యుగంధర్’లో కామియోగా కనిపించనున్నారు. ‘మూడు లాంతర్లు’, ‘కన్యాశుల్కం’ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నారు. కన్నడలో ‘బైల్’, ‘సత్య: సన్ ఆఫ్ హరిశ్చంద్ర’, ‘బిల్లా రంగా భాషా’ చిత్రాల్లోనూ కీలక పాత్రలు చేస్తున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్అదుర్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



