Monday, July 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసర్ర్పైజ్ చేసే యూనిక్ థ్రిల్లర్

సర్ర్పైజ్ చేసే యూనిక్ థ్రిల్లర్

- Advertisement -

సుమంత్‌ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన ‘సినిమా ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా. రాజేశ్‌ కర్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.హరీశ్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన హీరో అడివి శేష్ మాట్లాడుతూ,' ట్రైలర్ చాలా నచ్చింది. డైరెక్టర్ రాజేష్ ఇలాంటి సినిమా తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. ట్రైలర్‌లో చాలా మంచి ఎనర్జీ ఉంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా అనిపిస్తోంది. సుమంత్ నా ఫేవరెట్ బ్రో. నా ఫస్ట్ సినిమా నుంచి చాలా సపోర్ట్‌గా ఉన్నాడు. జగపతి బాబు చాలా స్టైలిష్‌గా అనిపించారు అని తెలిపారు. ”’మళ్లీ రావా’ సినిమా తర్వాత సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసిన కథ ఇది. ఈ సినిమాలో హీరో స్క్రీన్‌ప్లే. ఇందులో ప్రతి క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉంది. ప్రతి పాత్రకు కథను మలుపు తిప్పే అవకాశం ఉంటుంది. మంచి థ్రిల్ ఉన్నా, వాటి సెంట్రల్ డ్రామా ఫ్యామిలీ చుట్టూనే ఉంటుంది. ఇది ఈటీవీ విన్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటుంది. రాజేష్ స్టైల్, కథ, స్క్రీన్‌ప్లే నాకు చాలా నచ్చాయి. ఈ ట్రైలర్‌లో మేము చాలా తక్కువ కథనే చెబు తున్నాం. ఈనెల 31న మీరు థియేటర్లకు వస్తే చాలా పెద్ద సర్‌ప్రైజ్ ఉంటుందిఅని హీరో సుమంత్ చెప్పారు. ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ భరణ్ మాట్లాడుతూ, 'ఈటీవీ విన్ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన కథలు చేశాం. అన్నింటిలో మీరు మాకు తోడుగా ఉన్నారు. అలాంటి మరో వైవిధ్యమైన చిత్రం ఇది. రాజేష్ చాలా కొత్తరకం సినిమా చేశాడు. తను కచ్చితంగా చాలా మంచి దర్శకుడు అవుతాడు. మరోమారు మంచి సినిమాతో రాబోతున్నందుకు ఆనందంగా ఉంది అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -