ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాకుండా దర్శకుల సంఘ సభ్యుల మెడికల్ ఇన్సూరెన్స్ కోసం రూ.15 లక్షల రూపాయల విరాళాన్ని అందించి మరోమారు తన పెద్ద మనసును చాటుకున్నారు మోహన్ బాబు. మే 4వ తేదీన శిల్పకళా వేదికలో జరిగిన దర్శకరత్న డా.దాసరి నారాయణరావు జయంతి వేడుకల్లో మోహన్ బాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ వేడుకలో తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం నుండి ప్రతి ఏడూ ఒక పేద సభ్యుని కుమారుడు లేదా కుమార్తెకు తిరుపతిలోని తన ఎమ్.బి. యూనివర్శిటీలో ఉచిత విద్యనందిస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుండి తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘంలో సభ్యుడైన ఎలిపే శ్రీనివాసరావు (సహకార దర్శకుని) కుమార్తె ఎలిపే దేదీప్య సిరికి ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు ఉచితంగా విద్యనందించే ఏర్పాటు, ఉచిత హాస్టల్ వసతి కలుగ చేశారు. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం తరఫున అధ్యక్షులు వి.ఎన్.ఆదిత్య, ప్రధాన కార్యదర్శి పి.వి. రామరావు, కోశాధికారి నీలం సాయిరాజేష్, కార్యవర్గ నిర్వాహక కమిటీ అందరూ మోహన్ బాబుకి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి ఈ వితరణ తెలుగు చిత్ర దర్శకుల సంఘంలో సభ్యుల పిల్లలకు అద్భుతమైన భవిష్యత్తుని ఇవ్వనుందని ఆశా భావం వ్యక్తం చేశారు. అలాగే తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం సభ్యుల ట్రస్టుకు మోహన్ బాబు పదిహేను లక్షల రూపాయల విరాళం మెడికల్ ఇన్సురెన్స్ కోసం ప్రకటించడం పట్ల తెలుగు సినీ పరిశ్రమ వర్గాలన్నీ హర్ష ధ్వానాలు పలికాయి.
మాట నిలబెట్టుకున్నారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



