Monday, July 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'ఓం' రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఓం’ రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -

ధనుష్ ప్రధాన పాత్రలో ఆర్ టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఒక సినిమాని నిర్మిస్తున్నాయి. ‘అమరన్’ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కొత్త చిత్రానికి ‘ఓం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వండర్‌బార్ ఫిలిమ్స్ ప్రతినిధి శ్రేయస్ మాట్లాడుతూ,’ దర్శకుడు రాజ్ కుమార్, ధనుష్ కి నా కృతజ్ఞతలు. మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. నా సినీ ప్రయాణంలో ఇదే అత్యధిక బడ్జెట్ చిత్రమని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఆర్ టేక్ స్టూడియోస్ తో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. తమిళంలో వారికి ఇదే మొదటి చిత్రం. మా జర్నీ ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నాను. అక్టోబర్ 16న ఈ మూవీని విడుదల చేస్తున్నాంఅని అన్నారు. ‘ఈ జర్నీ నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. ఇది ఒక అద్భుతమైన కలయిక. ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది’ అని ఆర్ టేక్ స్టూడియోస్ ప్రతినిధులు శ్రద్ధ, అజ్మత్ చెప్పారు. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి మాట్లాడుతూ,'మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, ఇంద్రన్ , అనేకమంది ప్రతిభావంతులైన నటులు ఈ చిత్రంలో భాగమయ్యారు అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -