Monday, July 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకౌంట్ డౌన్ స్టార్ట్..

కౌంట్ డౌన్ స్టార్ట్..

- Advertisement -

యశ్‌ హీరోగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’. విడుదలకు ఇక కేవలం నెల రోజులే మిగిలాయి. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తూ మేకర్స్ మరో కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఫియర్, మిస్టరీ, స్టైల్‌ కలగలిసిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. KVN ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మించిన ‘టాక్సిక్’ తన ప్రత్యేకమైన ప్రమోషనల్ క్యాంపెయిన్‌తో ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. కథ గురించి ఎలాంటి వివరాలు వెల్లడించకుండా విడుదల చేస్తున్న ప్రతి పోస్టర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. టాక్సిక్ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది అని చిత్ర బృందం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -