- Advertisement -
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలంలోని కొడిచరా గ్రామ మాజీ సర్పంచ్ పోశెట్టివార్ సంతోష్ పటేల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ నా పైన నమ్మకంతో ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవ జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావుకు, అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జునరావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఐ కమాండ్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికైన సందర్భంగా జిల్లా ప్రజలకు మద్నూర్ మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఉగాది పర్వదినం అలాగే రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -



