Saturday, March 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఫేక్‌, రివిజన్‌, ప్యాబ్రికేటెడ్‌ బడ్జెట్‌

ఫేక్‌, రివిజన్‌, ప్యాబ్రికేటెడ్‌ బడ్జెట్‌

- Advertisement -

అందరిని మోసం చేసిన కాంగ్రెస్‌ సర్కార్‌ : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫేక్‌, రివిజన్‌, ప్యాబ్రికేటెడ్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. సమాజంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్‌ సర్కార్‌ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా రంగాలకు గతేడాది నిధులనే అక్షరం మార్చకుండా కొత్త బడ్జెట్‌లో పెట్టారనీ, విజన్‌ లేని బడ్జెట్‌ గనుకే ఇది రివిజన్‌ బడ్జెట్‌ అని ఎద్దేవా చేశారు. ఏటా బీసీలకు రూ.20 వేల కోట్ల కేటాయిస్తామని 4 శాతం నిధులతో మోసం చేశారన్నారు.

దాదాపు రూ.8.64 లక్షల కోట్లు అప్పు చేసిన రేవంత్‌ సర్కార్‌ ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల భారం మోపిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఒరిగిందేమి లేదని కొట్టిపారేశారు. రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీలన్ని ఫేక్‌ అనీ, అందుకే ఆయన ఇక నుంచి రాహుల్‌ ఫేక్‌ అని విమర్శించారు. ఉద్యమకారులను విస్మరించారనీ, ఇందిరమ్మ ఇండ్లకు గతేడాదితో పోలిస్తే రూ.7 వేల కోట్లు కోత విధించారని విమర్శించారు. సింగరేణి, ట్రాన్స్‌, జెన్‌కోలకు ఇవ్వాల్సిన రూ.1.50 లక్షల కోట్లను వెంటనే చెల్లించాలని ఆమె డిమాండ్‌ చేశారు. టీచర్ల నియామకాలు లేకుండా యంగ్‌ ఇండియా స్కూళ్లను నిర్మించి ఏం ప్రయోజనం? అని ఆమె ప్రశ్నించారు.

రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్‌లో క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ కేవలం రూ.50 వేల కోట్లలోపేననీ, సంపద ఎలా సృష్టిస్తారని ప్రశ్నించారు. రెవెన్యూ సర్‌ ప్లస్‌, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లలో అంచనాలను పెంచి ప్రజలను మోసం చేశారని కవిత దుయ్యబట్టారు. యంగ్‌ స్కిల్స్‌ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో 64 వేల మంది నమోదు చేసుకున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారనీ, వాస్తవానికి స్కిల్‌ యూనివర్సి టీలో 960 మంది మాత్రమే నమోదు చేసుకున్నారని తెలిపారు. వెంటనే యూనివర్సిటీ వెబ్‌సైట్‌లోని తప్పుడు సమాచారాన్ని తొలగించాలని డిమాండ్‌ చేశారు. రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌లో అవకాశం దక్కని రంగాలకు ప్రాధాన్యతనిచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని కవిత డిమాండ్‌ చేశారు.

విద్యాసాగర్‌ అక్రమాలపై విచారణ
స్త్రీనిధి విభాగంలో 14 ఏండ్లుగా ఉన్న విద్యాసాగర్‌ ను తొలగించాలని కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. గతంలో బీఆర్‌ఎస్‌ను, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వాలను మేనేజ్‌ చేసి విద్యాసాగర్‌ ఉద్యోగంలో కొనసాగుతున్నారని ఆమె ఆరోపించారు. ఆయన చేసే అక్రమాలపై విచారణ కమిషన్‌ వేసినప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. వెంటనే మంత్రి సీతక్క విచారణ చేయించి విద్యాసాగర్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -