నవతెలంగాణ – మద్నూర్
వ్యవసాయ రైతులు పండించిన శనగ పంటను మద్దతు ధర కొనుగోలు కేంద్రాల్లోనే పంటను అమ్ముకోవాలని, ప్రవేటు వ్యాపారులకు అమ్ముకొని మోసపోవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు శనగ పంట రైతులను కోరారు. శనివారం శనగ పంట మద్దతు ధర కొనుగోళ్ల కేంద్రాలను మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో మద్నూర్ సింగిల్ విండో ఆధ్వర్యంలో ఒక కొనుగోలు కేంద్రం డోంగ్లి మండల కేంద్రంలో అక్కడి సింగిల్ విండో ఆధ్వర్యంలో మరో కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు శ్రేయస్సు కోసమే మద్దతు ధర కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు తెలిపారు. ప్రైవేట్ పరంగా శనగ పంట క్వింటాలుకు 5100 ఉన్నట్లు తెలుస్తోందని, ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు శనగ పంట రూ.5875 ఉందని అన్నారు. దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మద్దతు ధర కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేకు అతి సన్నితుడైన సాయి పటేల్, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, వైస్ చైర్మన్ పరమేష్, పటేల్ సింగిల్ విండో మాజీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ గంగాధర్, మద్నూర్ స్థానిక సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హనుమంతు యాదవ్, మద్నూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి గోపి, మద్నూర్ డోంగ్లి సింగిల్ విండోలా పర్సన్ ఇంచార్జ్ సిహెచ్ లక్ష్మీనారాయణ, మద్నూర్ సింగిల్ విండో సెక్రెటరీ గంగాధర్, మద్నూర్ ఎఫ్ పి ఓ చైర్మన్ గోపాల్, మద్నూర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ మార్కెట్ కమిటీ సూపర్వైజర్లు సింగిల్ విండోల సిబ్బంది శనగ పంట రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



