నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో శనగ పంట మద్దతు ధర కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసమే పాటు పడుతుందని శనగ పంట రైతులు పండించిన పంటను ప్రైవేటులో అమ్ముకొని మోసపోకుండా మద్దతు ధర కేంద్రాలను సద్వినియోగం పరుచుకోవాలని ఎమ్మెల్యే రైతులను కోరారు.
మద్దతు ధర క్వింటాలుకు 5875 రూపాయలు ఉందని ప్రవేట్ పరంగా 5,100 పలుకుతున్నట్లు తెలుస్తుందని ప్రైవేటు ధరలకు మద్దతు ధరలకు చాలా తేడా ఉన్నందున రైతులు మోసపోకుండా మద్దతు ధర కేంద్రంలో అమ్ముకొని లాభపడాలని సూచించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సింగిల్ విండో పర్సన్ ఇంచార్జ్ సిహెచ్ లక్ష్మీనారాయణ,సింగిల్ విండో కార్యదర్శి బాబురావు, డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గజానంద్ దేశాయ్, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, నాయకులు ఉమాకాంత్ పటేల్, చాంద్ పటేల్, వసంత్‌రావు పటేల్, ధనుంజయ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.



