- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు (ఆగస్టు 1) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏపీలో సుమారు రూ.17,900 కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం ప్రధాని షెడ్యూల్ లో కీలకంగా నిలవనుంది. మోడీ పర్యటనకు సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) విడుదల చేసింది. ఈ పర్యటన ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక ప్రగతికి గణనీయమైన ఊపునిస్తుందని భావిస్తున్నారు.
- Advertisement -



