Friday, July 31, 2026
E-PAPER
Homeజిల్లాలుపెద్ది సుదర్శన్ రెడ్డి మృతి తెలంగాణకు తీరని లోటు: చల్లా ధర్మారెడ్డి

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి తెలంగాణకు తీరని లోటు: చల్లా ధర్మారెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపట్ల పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించి, తెలంగాణ ఆకాంక్షల సాధనతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన ప్రజానాయకుడిగా చిరస్మరణీయులని కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి, నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -