Friday, July 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గీతన్న చైతన్య యాత్ర సభను విజయవంతం చేయండి

గీతన్న చైతన్య యాత్ర సభను విజయవంతం చేయండి

- Advertisement -

–  కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు  సైదగౌని వెంకట్ గౌడ్
నవతెలంగాణ – కామారెడ్డి

కల్లు గీత కార్మికుల సమస్యల పరిష్కారం, వృత్తి రక్షణ కోసం నిర్వహిస్తున్న గీతన్న చైతన్య బస్సు యాత్రను, అలాగే ఆగస్టు 12న కామారెడ్డిలో జరిగే గీతన్న సభను విజయవంతం చేయాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సైదగౌని వెంకట్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు రాజా గౌడ్ పిలుపునిచ్చారు.

శుక్రవారం కామారెడ్డి పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో కల్లు డిపో 1 లో గీతన్న చైతన్య యాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సైదగౌని వెంకట్ గౌడ్ మాట్లాడుతూ, కల్లు గీత వృత్తి రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 2 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే గీతన్న చైతన్య బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. గీత కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడి అనేక విజయాలు సాధించినప్పటికీ, ప్రస్తుతం వారి సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.

50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గౌడ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని, హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సర్వాయి సర్ధార్ పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా గీత కార్మికుల సమస్యలను ప్రజలకు తెలియజేయడమే ఈ చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నుంచి ప్రారంభమైన ఈ బస్సు యాత్ర ఆగస్టు 12న ఉదయం 10 గంటలకు మాచారెడ్డికి చేరుకుంటుందని, అక్కడి నుంచి బైక్ ర్యాలీగా కామారెడ్డికి చేరుకుని రేణుకా ఫంక్షన్ హాల్‌లో సభ నిర్వహిస్తామని చెప్పారు. గౌడ సంఘ సభ్యులందరూ ఐక్యంగా పాల్గొని బస్సు యాత్రను, సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు రాజా గౌడ్, రామచందర్ గౌడ్, శ్రీధర్ గౌడ్, యాదగిరి గౌడ్, శైలేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజు గౌడ్, కార్యదర్శి రాజా గౌడ్, పెంటా గౌడ్, స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -