నవతెలంగాణ-హైదరాబాద్: మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. పలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారులపై కూడా కేసులు నమోదైనట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) చేపట్టిన ఆందోళనల సమయంలో ప్రధాని మోడీ లక్ష్యంగా మార్ఫింగ్, ఎఐ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. వ్యాపారవేత్త ఎస్.అరవిందరెడ్డి, తెలంగాణ బిజెపి కార్యకర్త టి.సాయి కిరణ్ గౌడ్ ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఖాతాల్లో ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు, తప్పుదారి పట్టించేవి పోస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల నిరసనలకు సంబంధించిన అనేక పోస్ట్‌లు, వ్యాఖ్యలను గుర్తించామని, వాటిలో దూషణలు, అసభ్యకరమైన అంశాలు ఉన్నట్లు తేలిందని అన్నారు. ఈ కంటెంట్‌ను రూపొందించి, ప్రచారం చేసిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.
మెటా ఇండియా హెడ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసులు
- Advertisement -
- Advertisement -



