Sunday, March 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డీసీసీ కార్యదర్శి సాయగౌడ్ కు ఘన సన్మానం

డీసీసీ కార్యదర్శి సాయగౌడ్ కు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
నసురుల్లాబాద్ మండల కేంద్రాన్ని చెందిన మంతపూరి సాయగౌడ్ (తుమ్)కు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గా నియమితులయ్యారు. గురువారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించిన డీసీసీ కమిటీలో సాయగౌడ్ కు అవకాశం దక్కింది. ఈ సందర్బంగా ఆదివారం నసురుల్లాబాద్ గ్రామంలో గౌడ్ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా తుమ్ సాయగౌడ్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు నర్సింలు గౌడ్, పండరి గౌడ్, బాలమల్లు గౌడ్, సాయగౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, అశోక్ గౌడ్, మైషాగౌడ్, గణేష్ గౌడ్, సందీప్ గౌడ్, వేణుగోపాల్ గౌడ్, భానుచందర్ గౌడ్, లింగంగౌడ్,సాయగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -