Sunday, March 22, 2026
E-PAPER
Homeఖమ్మంనూనె శుద్ధి కర్మాగారం,‌ పామాయిల్ పరిశ్రమ వెంటనే నిర్మించాలి 

నూనె శుద్ధి కర్మాగారం,‌ పామాయిల్ పరిశ్రమ వెంటనే నిర్మించాలి 

- Advertisement -

– ఆయిల్ పామ్ గ్రోయర్స్ సొసైటీ డిమాండ్
నవతెలంగాణ – అశ్వారావుపేట 

అశ్వారావుపేట నియోజకవర్గంలో నూనె శుద్ధి కర్మాగారం, అశ్వారావుపేట లో మరో నూతన పరిశ్రమ ను తక్షణమే నిర్మించాలని తెలంగాణా ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ ఫాం గ్రోయర్స్ సొసైటీ బాధ్యులు ఆదివారం నారంవారిగూడెం సమీపంలోని ఆయిల్ ఫెడ్ డివిజనల్ కార్యాలయం లో ధర్నా నిర్వహించారు.తదుపరి హాజరైన రైతులను ఉద్దేశించి ఈ సొసైటీ అద్యక్ష కార్యదర్శులు మహే‌శ్వరరెడ్డి, పుల్లయ్య,శ్రీరాములు మాట్లాడారు.అనంతరం డివిజనల్ అధికారి కి రాసిన వినతి పత్రాన్ని నర్సరీ ఇంచార్జి అశోక్ కు వినతి సమర్పించారు.

ఆ వినతి పత్రం లోని సారాంశం యథాతథంగా..
తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాల లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ లో గత ఆయిల్ ఇయర్ లో ఇక్కడి రైతులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి, ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి కి, ఉద్యోగ కల్పనకి ఆయిల్ ఫెడ్ ముందు కొన్ని డిమాండ్స్ సాధన కోసం ఈ ధర్నా చేస్తున్నాము.

ముందుగా మా ఆయిల్ పామ్ రైతుల ప్రధాన డిమాండ్ అయిన జిల్లాకి కనీసం ఒక పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కట్టాలి అనే దానిలో భాగంగా ఆదివారం సిద్దిపేట జిల్లా నెర్మెట్ట లో 30 టీపీహెచ్ సామర్థ్యం తో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించటం శుభపరిణామం. అట్లాగే ఆయిల్ ఫెడ్ మా ప్రధాన డిమాండ్ లు నెరవేర్చాలి అని ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఆయిల్ పామ్ రిఫైనరీ ను అశ్వారావుపేట లేక అప్పారావు పేట ఫ్యాక్టరీ ల లో ఏదో ఒక చోట ప్రారంభించాలి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాల లో ఇప్పటికే ఉన్న రెండు ఫ్యాక్టరీ స్ నుండి 1 లక్ష టన్నుల క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అవుతున్నది. అట్లాగే కల్లూరుగూడెం ఫ్యాక్టరీ, అత్యధికం గా ప్రస్తుతం ఆయిల్ పామ్ వేస్తున్న ములకలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలం, మణుగూరు లాంటి ప్రాంతాల లో కూడా భవిష్యత్తు లో ఫ్యాక్టరీ స్ కట్టాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో రిపైనరీ కడితే ఇక్కడి క్రూడ్ ఆయిల్ ను ఇక్కడే ప్రాసెస్ చేస్తే ఆయిల్ ఫెడ్ కు మంచి లాభాలు వస్తాయి.

ఇక్కడ రిఫైనరీ పెట్టకుండా ఇక్కడి క్రూడ్ ఆయిల్ ను నెర్మెట్ట కు తరలించడానికి మేము వ్యతిరేకరిస్తున్నాము.ఎందుకంటే ఇక్కడ నుండి 1 లక్ష టన్నులు సిద్దిపేట తరలించాలి అంటే సంవత్సరం లో 4 వేల ట్యాంకర్లు,కనీసం ఒక్కో ట్యాంకర్ కు 35 వేల నుండి 40 వేలు అనగా సంవత్సరానికి 16 కోట్లు కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జి చెల్లించాలి. దానికి బదులు రూ.40 కోట్లతో ఇక్కడే రిపైనరీ కట్టటం మంచిది అని, ఉమ్మడి ఖమ్మం జిల్లాల మోనో క్రాప్ గా ఆయిల్ పామ్ తోటలు వచ్చి మిగతా పంటలు ఈ ప్రాంతం మరో 5 సంవత్సరాలలో కనుమరుగు అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ ప్రాంతం లో వేరే పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు కాబట్టి గత ఎన్నికల సమయం అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో రిఫైనరీ స్థాపన హామీ అమలు జరిపి ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి కి, ఈ ప్రాంత యువత కి 1000 ఉద్యోగాల కల్పనకు కృషి చేయాలి అని డిమాండ్ చేస్తున్నాము.

అశ్వారావుపేట లో 60 టీపీహెచ్ హారిజాంటల్ స్టెరిలైజేషన్ లో కొత్త ఫ్యాక్టరీ కట్టాలి.

అశ్వారావుపేట ఫ్యాక్టరీ 2007 సంవత్సరం లో కట్టబడి ప్రస్తుతం మెషినరీ పాతబడి గత సంవత్సరం అనేకసార్లు బ్రేక్డౌన్ అయింది. దాని వలన ఆయిల్ పామ్ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఈ ఫ్యాక్టరీ 5 టన్నుల కెపాసిటీ నుండి దశల వారీ 30 టన్నులకు పెంచటం వలన లేటెస్ట్ మలేసియా టెక్నాలజీ మెషినరీ బిగించటానికి అనుకూలం కాదు కాబట్టి ఈ ప్రాంతం లో వస్తున్న కొత్త ఆయిల్ పామ్ తోటల విస్తరణ ను దృష్టిలో పెట్టుకొని ఒకే సారి 60 టీపీహెచ్ తో కొత్త ఫ్యాక్టరీ నిర్మించాలి అని డిమాండ్ చేస్తున్నాము.

పెద్దగా ఆయిల్ పామ్ విస్తరణ లేని చోట రూ.300 కోట్ల తో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కట్టి, రూ.40 కోట్లతో రిఫైనరీ కట్టటానికి సిద్దపడిన ఆయిల్ ఫెడ్ కు గత ఆయిల్ ఇయర్ లో రూ.180 కోట్లు లాభాలు ఇచ్చిన ఉమ్మడి ఖమ్మం జిల్లా లో రః.40 కోట్లతో రిఫైనరీ, రూ.60 కోట్లతో అశ్వారావుపేట లో కొత్త ఫ్యాక్టరీ కట్టటం పెద్ద కష్టం కాదు అని తెలియచేస్తున్నాము.

పామాయిల్ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు రిఫైనరీ,అశ్వారావుపేట లో కొత్త పామాయిల్ ఫ్యాక్టరీ ని స్థాపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, మా అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకోవాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము.

ఈ కార్యక్రమంలో కారం శ్రీరాములు,తలశిల ప్రసాద్,చెలికాని సూరిబాబు, వెంకట్, మోరంపుడి శ్రీనివాస్ రావు,బి.చిరంజీవి,సోడెం ప్రసాద్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -