Sunday, March 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ వ్యవసాయ పథకాలపై అవగాహనకు రైతుల పర్యటన..

ప్రభుత్వ వ్యవసాయ పథకాలపై అవగాహనకు రైతుల పర్యటన..

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్ 
ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన రైతులు ప్రజా పాలనలో భాగంగా నిర్వహిస్తున్న రైతు ఉత్సవాలకు హాజరుకావడానికి ఉత్సాహంగా బయలుదేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో జరగనున్న ఈ కార్యక్రమంపై రైతుల్లో విశేష ఆసక్తి నెలకొంది.ఈ సందర్భంగా రైతులు ఆయిల్ ఫామ్ కర్మాగారం మరియు వ్యవసాయ ప్రదర్శనశాలను సందర్శించనున్నారు.

అలాగే టీజీ ఆయిల్ షెడ్ ఫామ్ కర్మాగారం ప్రారంభోత్సవంలో పాల్గొనడంతో పాటు, రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలపై అవగాహన పెంపొందించుకోవడమే లక్ష్యంగా అధికారులు మరియు రైతులు కలిసి ఈ పర్యటనకు వెళ్లారు.ఈ కార్యక్రమంలో శారాజిపేట సర్పంచ్ కంతి మధు,అగ్రికల్చర్ ఏడీ శ్రీనివాస్, భార్గవి, గ్రామ శాఖ అధ్యక్షుడు చిలుకు నాగరాజు, వాడు సభ్యులు పెండ్యాల నాగరాజు పాల్గొన్నారు. అలాగే రైతులు నారీ మల్లయ్య,శిరమైన రామ్ నర్సయ్య, చంద్రశేఖర్,శ్రీనివాస్, దిలీప్,కృష్ణ, ఆడెపు నవనీత, పుట్టల లక్ష్మి,చిలుకు పాతమ్మ, పద్మ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -