- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కేరళలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు మరణించారు. కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో మరణాలు సంభవించాయి. దాదాపు 100 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. తామరస్సేరి ఘాట్, కోజికోడ్-వాయనాడ్ సహా 6 ప్రధాన రహదారులు ధ్వంసం కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఈ మేరకు పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచనలు జారీ చేశారు.
- Advertisement -



