Sunday, August 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలో మరోసారి తుపాకి గర్జించింది. వాయవ్య రాష్ట్రమైన ఇదాహోలో శనివారం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ట్విన్ ఫాల్స్ నగరంలోని ప్రముఖ ‘ఇన్-ఎన్-అవుట్’ రెస్టారెంట్ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం, శనివారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో రెస్టారెంట్ లోపల కాల్పులు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై ట్విన్ ఫాల్స్ పోలీస్ చీఫ్ మాథ్యూ హిక్స్ శనివారం రాత్రి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కాల్పుల్లో మరణాలు సంభవించాయని ధ్రువీకరించిన ఆయన, గాయపడిన పలువురిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాల్పులకు తెగబడిన అనుమానిత దుండగుడు కూడా మరణించినట్లు హిక్స్ ప్రకటించారు. అయితే, నిందితుడు ఎలా చనిపోయాడనే వివరాలు వెల్లడించలేదు. “మేము నిందితుడి గుర్తింపు, దాడి వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం” అని ఆయన వివరించారు.

కాల్పుల సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా, సమీపంలోని వంతెన సహా పలు రోడ్లను మూసివేసి, ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించారు. గత నెలలో కూడా ఇలాంటి ఘటనే సియాటిల్‌లో జరిగింది. ఓ ఫుడ్ ఫెస్టివల్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -