సర్పంచ్ బండం శోభరాణి రాంరెడ్డి ఆధ్వర్యంలో కార్యదర్శి కర్ణాకర్ పర్యవేక్షణలో చర్యల
నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని గంగారం గ్రామపంచాయతీ స్వచ్ఛత, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. సర్పంచ్ బండం శోభరాణి రాంరెడ్డి ఆధ్వర్యంలో కార్యదర్శి కర్ణాకర్ పర్యవేక్షణలో గ్రామంలో పరిశుభ్రత పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. చెత్త నిర్వహణ, కాలువల శుభ్రత, రోడ్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
గ్రామ ప్రజలకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ కార్యదర్శి కర్ణాకర్ పర్యవేక్షణలో సంబంధిత సిబ్బందితో కలిసి వెంటనే పరిష్కార చర్యలు చేపడుతున్నారు. తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నారు.
అలాగే గ్రామ ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సర్పంచ్ బండం శోభరాణి రాంరెడ్డి పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధి, పరిశుభ్రత కోసం అధికారులు, ప్రజలు సమిష్టిగా పనిచేస్తే గంగారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దగలమని వారు తెలిపారు.



