- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
ఈ నెల 27న వడ్లూరు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ని ఆహ్వానించారు. మంగళవారం కామారెడ్డి పట్టణ కేంద్రంలోని ఆయన నివాసంలో వడ్లూరు 1వ వార్డు కౌన్సిలర్ గడ్డమీది మహేష్ మర్యాదపూర్వకంగా ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కందం నారాయణ, జువ్వాడి సంతోష్, నారాయణ, మహేందర్, రాజిరెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ముదాం నర్సింలు, ఈశ్వర్, రాజు, గెల్లా మహేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



