Tuesday, March 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నత్తనడకన ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు

నత్తనడకన ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు

- Advertisement -
  • మూడేళ్లుగా కొనసాగుతున్న పనులు
    – ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
    – పెరుగుతున్న ప్రమాదాలు
    నవతెలంగాణ – పెద్దవూర
    రహదారుల వెంట ప్రమాదాలు జరగకుండా చూడటమే కాకుండా ప్రయాణాలు సాఫీగా జరిగేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా మండలం లోని పెద్దవూర మండల కేంద్రం కోదాడ, జెడ్చర్ల జాతీయ రహదారి, నగార్జునసాగర్ హైదరాబాద్ జాతీయ రహదారిలో చేపడుతున్న ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై సుమారు మూడేళ్లు గడుస్తున్నా  నిర్మాణం పూర్తికావడం లేదు. పర్యవేక్షణ లోపం తోట్రాఫిక్‌ కష్టాలతో పాటు నిత్య ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా యి. అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం నిర్మాణాలను పూర్తి చేయడంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపనులు వినిపిస్తున్నాయి.

    -ఫ్లై ఓవర్ కిందుగా వెళ్లే టప్పుడు ప్రమాదాలు
  • ఫ్లై ఓవర్ కిందినుంచి సాగర్ వెళ్లే టప్పుడు నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాహనాల తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని  రూ. 45కోట్ల అంచనా వ్యయంతో 2023 అక్టోబరు 2న
  • అర కిలోమీటరు పైగానే ఫ్లైఓవర్‌ నిర్మాణా న్ని పనులు ప్రారంభించారు. మూడేళ్లు గడుస్తు న్నా ఫ్లైఓవర్‌ నిర్మాణంలో వేగం కనిపించడం లేదు. అధికారులు, కాంట్రాక్టర్లు సైతం నిర్మాణం లో అలసత్వం వహిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అయితే పనులు ప్రారంభమైన కొద్ది రోజలకు రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు రావడం ప్రభుత్వాలు మారడం వంటివి చకచకా జరిగిపోయాయి.

  • అయితే నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం ఫ్లైఓవర్‌ నిర్మాణంలో చిన్న చిన్న మార్పులతో అంచనా వ్యయం కాస్తా రూ.65 కోట్లకు పెంచింది. అయినా పనులు పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఆ మార్గం గుండా వచ్చే వాహనాదారులు నిత్యకష్టాలను అనుభవిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తయితే నాగార్జున సాగర్,కోదాడ -జెడ్చర్ల వద్ద జాతీయ రహదారులపై వాహనాల రద్దీ తగ్గే అవకాశంఉంది.

-రెండు జాతీయ రహదారులకు కేంద్రం

హైదరాబాద్ పెద్దవూర మీదుగా నాగార్జున సాగర్,గుంటూరు రహదారి,కోదాడ -జెడ్చర్ల జాతీయ రహదారులకు కేంద్రంగా పెద్దవూర వుంది.
రెండు జాతీయ రహదారులు కావడంతో రోడ్డు ప్రదాన రహదారి కావడంతో అధిక సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కార్లతో పాటు భారీ వాహనాలు వస్తుంటాయి. పెదవూర ఎక్స్ రోడ్డు వద్ద ట్రాఫిక్‌ డైవర్షన సూచికల లోపంతో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కోదాడ వైపు నుంచి వచ్చే వాహనాలు పెద్దవూర ఎక్స్  రోడ్డు మీదుగా దేవరకొండ-జెడ్చెర్ల వరకు వెళుతుంటాయి. రహదారిపై వాహనాలు వేగంగా వస్తుండటం ఒక్కసారిగా డైవర్షన రావడంతో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఫ్లై ఓవర్ లో లారీ ఇరుక్కొని పోయింది. దానిని తీయుటకు రెండు రోజులు పట్టింది. అదే సమయంలో అప్రాంత లో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

ఈ పనులు ప్రారంభించిన దగ్గరి నుంచి ట్రాఫిక్‌కు  చాలా  ఇబ్బందిగా ఉంది. పెద్దవూర ఎక్స్ రోడ్డు వద్దకు  రాగానే మూడు వైపుల నుంచి వచ్చే వాహనాలన్నీ ఒక్క దగ్గరికీ రావడంతో రోడ్డు క్రాస్‌ చేయాలంటే ఇబ్బందిగా ఉంది.వాహనాల వేగానికి విపరీతమైన దుమ్ము లేస్తోంది. ఇది కళ్లలో పడి రహదారి కూడా కనిపించడం లేదు. దీంతో వెనుక నుంచి వాహనాలతో ఇబ్బందులలు ఎదురవుతున్నాయని కాలాయాపన చేయకుండా త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -