Tuesday, March 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దతూండ్ల పాఠశాలలో వెజిటేబుల్స్ సలాడ్ డే

పెద్దతూండ్ల పాఠశాలలో వెజిటేబుల్స్ సలాడ్ డే

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వెజిటేబుల్స్ సలాడ్ డే నిర్వహించినట్లుగా ప్రధానోపాధ్యాయుడు బి.తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. విద్యార్థులు పచ్చి తాజా కూరగాయలను తినడం ద్వారా కావలసిన ఖనిజ లవణాలు, పోషక పదార్థాలు లభించి ఆరోగ్యవంతంగా ఉంటారని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు వెజిటబుల్ సలాడ్ అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు పానుగంటి మానస, సిహెచ్ శర్మ, మహమ్మద్ యాకూబ్ పాషా, ఐత మహేందర్ మందల సుజాత, అజ్మీర గోపి నాయక్, తోట చంద్ర ప్రకాష్, ఓఎస్ కట్యాలసందీప్ కుమార్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -