Wednesday, August 5, 2026
E-PAPER
Homeసినిమా‘అలియాస్ రుక్మిణి’ మొదలైంది

‘అలియాస్ రుక్మిణి’ మొదలైంది

- Advertisement -

హీరో నాని సమర్పణలో తెరకెక్కిన ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ఘన విజయా నంతరం ఆయన యూనానిమస్ ప్రొడక్షన్స్ రెండో చిత్రాన్ని అధికారికంగా ప్రకటిం చారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు.
దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అలియాస్ రుక్మిణి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ, విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది. ఈ చిత్రాన్ని తాజాగా సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టగా, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నాని తండ్రి గంటా రాంబాబు, నిర్మాత వెంకట్ బోయనపల్లి స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. ‘కోర్ట్’ దర్శకుడు రామ్ జగదీష్, శైలేష్ కొలను కలిసి తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు.
నాని మాట్లాడుతూ,‘నా కెరీర్ ప్రారంభం నుంచే, నేను సక్సెస్ కాకముందే నితిన్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ‘జయం’, ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి సినిమాల్లో నితిన్‌ను ప్రేక్షకులు ఎంతగా ప్రేమించారో మనందరికీ తెలుసు. ఇప్పుడు ‘అలియాస్ రుక్మిణి’తో మరోసారి ఆయనను ప్రేమించేలా చేసే సినిమా చేస్తున్నామనే నమ్మకం ఉంది. ఇది చాలా అందమైన ప్రేమకథ. మంచి కథ, అద్భుతమైన టెక్నీషియన్స్‌తో కలిసొస్తే అలాంటి ప్రేమకథలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రేక్షకులు చాలా కాలం గుర్తుంచుకునే సినిమా చేయబోతున్నాం. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ సినిమా చాలా ప్రత్యేకంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -