- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని నిర్ణయించింది. ఈ పెంపు జనాభా తేడా లేకుండా అన్ని రాష్ట్రాలకు సమానంగా వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కి, లోక్‌సభ సీట్లు 25 నుంచి 38కి పెరుగుతాయి. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 179కి, లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కి పెరుగుతాయి. ఈ నిర్ణయం రాజకీయ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని, కొత్త నియోజకవర్గాలు, నాయకులను సృష్టించి ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మారుస్తుందని భావిస్తున్నారు.
- Advertisement -



