Tuesday, March 24, 2026
E-PAPER
Homeఖమ్మంపర్యావరణ పరిరక్షణలో పిచ్చుకదే అగ్రస్థానం

పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకదే అగ్రస్థానం

- Advertisement -

– హెచ్ ఎం హరిత
నవతెలంగాణ – అశ్వారావుపేట 

పర్యవారవరణాన్ని పరిరక్షించుటలో పిచ్చుకదే అగ్రస్థానమని, పిచ్చుకలను కాపాడాలని అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత అన్నారు. మంగళవారం పాఠశాలలో నేషనల్ గ్రాన్ కార్ప్స్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పంటల్ని కాపాడడం లోనూ, పర్యావరణాన్ని కాపాడడంలో నూ పిచ్చుకల దే ప్రధాన పాత్ర అని కానీ నేడు సెల్ టవర్లు కల్పిస్తున్న రేడియేషన్ ను, ఎండ వేడిమి లను తట్టుకోలేక అవి కనుమరుగవుతున్నాయి అని అందుకే ప్రపంచవ్యాప్తంగా పిచ్చుకల దినోత్సవాన్ని కూడా నిర్వహించి వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

వేసవిలో వాటి దాహాన్ని, ఆకలిని తీర్చడం కోసం టి గోడలపైన, టెర్రస్ ల పై కాసిని నీళ్లను, తిండి గింజలను ఉంచాలని పిట్టల్ని  కాపాడి తేనే పర్యావరణం ను కాపాడగలమని సృష్టిలో ప్రతీ జీవి ముఖ్యమైనదే నని అన్నారు. అనంతరం విద్యార్ధులకు నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సైన్సు ఉపాధ్యాయులు లక్ష్మయ్య, మధు,చలపతిరావు, మధుబాబు, సువార్తమ్మ, పర్వీన్, హరిబాబు ,సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -