- Advertisement -
- రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-వెల్దండ: వెల్డండ మండల పరిధిలోని చేర్కూర్ గ్రామానికి చెందిన దొడ్ల రమేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి నివాళులు అర్పించారు. రమేష్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు రూ.10 ఆర్థిక సాయం అందజేశారు. అలాగే రమేష్ పిల్లల చదువులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శ్రీశైలం-హైద్రాబాద్ జాతీయ రహదారిపై జరుగుతున్న వరుస ప్రమాదాల పట్ల గోలి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆందోళ వ్యక్తం చేశారు. నేషనల్ హైవే 765 పై ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులతో మాట్లాడారు. రోడ్డు భద్రతపై నిర్లక్ష్యం వహించరాదని ప్రమాదాలను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాల రక్షణ ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -



