Tuesday, August 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలురష్యా బీచ్‌పై డ్రోన్ దాడి..ఏడుగురు మృతి

రష్యా బీచ్‌పై డ్రోన్ దాడి..ఏడుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రష్యాలోని క్రాస్నోడార్ ప్రాంతంలోని గెలెండ్‌జిక్ సమీపంలోని ఆర్ఖిపో-ఒసిపోవ్కా బీచ్‌పై జరిగిన డ్రోన్ దాడి విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 40 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు సంభవించడంతో బీచ్‌లో ఉన్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాడిని రష్యా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండిస్తూ, ఉక్రెయిన్ పౌరులపై దాడులు చేస్తోందని ఆరోపించింది. ఈ ఘటనకు తగిన ప్రతిస్పందన తప్పదని రష్యా హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -