టెహ్రాన్ : ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ కోరుకుంటోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెబుతున్నప్పటికీ టెహ్రాన్ ఆయన మాటలకు ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదు. నష్టపరిహారం చెల్లిస్తామని, ఆంక్షల నుంచి ఊరట కల్పిస్తామని, అమెరికా జోక్యం చేసుకోబోదని హామీ ఇచ్చే వరకూ యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీకి సీనియర్ సైనిక సలహాదారుగా వ్యవహరిస్తున్న మొహసేన్ రెజాయి స్పష్టం చేశారు. టెలివిజన్‌లో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ యుద్ధం ముగియాలంటే తాము విధించే షరతులకు అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పారు. పూర్తి జవాబుదారీతనం పొందకుండా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. ‘జరిగిన నష్టాలకు పరిహారం అందే వరకూ యుద్ధం కొనసాగుతుంది. ఆర్థిక ఆంక్షలన్నింటినీ ఎత్తివేయాలి. మా వ్యవహారాలలో అమెరికా జోక్యం చేసుకోబోదని అంతర్జాతీయంగా చట్టపరమైన హామీ లభించాలి. అప్పుడే యుద్ధ విరమణ’ అని తెలిపారు. ‘ఈ యుద్ధం సంప్రదాయ ప్రతీకార తర్కానికి భిన్నంగా ఉంటుంది. ఈసారి కన్నుకు కన్ను కాదు. కన్నుకు తల అవుతుంది. మీరు గల్ఫ్‌ను వదిలిపోవాల్సి ఉంటుంది’ అని రెజాయి వ్యాఖ్యానించారు. యుద్ధం ఎన్ని వారాలు కొనసాగినప్పటికీ ఒత్తిడిని తట్టుకోగలమని చెప్పారు. వారం రోజుల క్రితమే యుద్ధం ముగింపు దశకు చేరుకున్నదని, కాల్పుల విరమణ పాటించేందుకు అమెరికా సిద్ధపడిందని తెలిపారు. అయితే యుద్ధాన్ని కొనసాగించాలని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ పట్టుపట్టారని రెజాయి అన్నారు.
ఆ మూడు షరతులకు ఓకే అంటేనే.. యుద్ధం ముగింపుపై ఇరాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



