భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఖగేష్ తమ్మినేని దర్శకుడు. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఈనెల 7న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ బోతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు మీడియాతో పలు సినీ విశేషాలను షేర్ చేసుకున్నారు. త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ,‘నాయుడు మా ఊరిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇండస్ట్రీలోకి వస్తానని నాతో ఎప్పుడూ అంటూ ఉండేవాడు. కానీ నేను మాత్రం వద్దు అని అనేవాడ్ని. చివరకు పట్టుదలతో ఇక్కడకు వచ్చి నిర్మాత అయ్యాడు. ఈ కథను నేనే రాసుకున్నాను. కానీ తీయకుండా అలా పెట్టేశాను. దర్శకుడిగా జర్నీ మొదలైన తర్వాత సమీకరణాలు మారుతూ వచ్చాయి. అందుకే నా దగ్గర ఉన్న మంచి కథల్ని భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద తీయాలని అనుకుంటున్నాం. దాదాపు ఈ మూవీని కూడా నేనే తీసినట్టు చెప్పుకోవచ్చు. ఓ టౌన్‌లో జరిగే లవ్ స్టోరీ. అందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఈ కథకి ‘అనకాపల్లి’ టైటిల్ యాప్ట్‌గా ఉంటుంది. పైగా సొంతూరు అనే మమకారంతో ఆ పేరు పెట్టాను’ అని తెలిపారు.
‘మా సొంత ఊర్లో షూట్ చేయడంతో మాకు బాగా కలిసి వచ్చింది. ప్రతీ ఒక్కరూ మాకు సాయం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకెంతో సపోర్ట్ చేసింది. నేచురల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం వల్ల అవుట్ పుట్ మరింత ఎఫెక్టివ్‌గా వచ్చింది. మొత్తం 75 లొకేషన్లలో చిత్రీకరించాం. సినిమా చాలా గ్రాండ్‌గా వచ్చింది. ఇప్పుడున్న జెన్ జీ తరానికి ఎమోషన్స్ తెలియడం లేదు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని మళ్లీ అందరికీ తెలియా లని, గుర్తించాలని ఈ మూవీని తీశాం. ప్రస్తుత తరం ఫ్యామిలీ డ్రామాకి కనెక్ట్ అవ్వాలని తీశాం. ఓ సందేశం ఇవ్వాలని అనుకున్నాను. ఇది నా బాధ్యత అనుకుంటు న్నాను. యాక్షన్ ఎక్కువగానే ఉన్నా కూడా ఫ్యామిలీ డ్రామానే డామినేట్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వాళ్లతో చర్చలు జరుపుతున్నాం. సినిమాని చూసిన తర్వాతే రిలీజ్ చేసేందుకు మైత్రి శశి ముందుకు వచ్చారు. దర్శకుడు ఖగేష్ ఈ మూవీని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు’ అని కాండ్రేగుల నాయుడు చెప్పారు.
వినోదం+సందేశం
- Advertisement -
- Advertisement -



