- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన యువ నటి, మోడల్ హర్షిల్ కాలియా (30) కన్నుమూశారు. జైపూర్‌లో జరిగిన ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా షిప్రా పాత్ రోడ్డులో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. కారు పల్టీ కొట్టడంతో ఆమె తలకు తీవ్ర గాయాలై మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా కాలియా ‘క్రైమ్ నెక్స్ట్ డోర్’ వెబ్ సిరీస్‌తో పాటు ఆమె పలు రాజస్థానీ సాంగ్స్‌లో నటించారు.
- Advertisement -



