Wednesday, August 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపాండిచ్చేరిలో కీలక షెడ్యూల్‌

పాండిచ్చేరిలో కీలక షెడ్యూల్‌

- Advertisement -

హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తూ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది రామ్‌ నటిస్తున్న 23వ సినిమా. ప్రస్తుతం చిత్ర యూనిట్ పాండిచ్చేరిలో కీలక షెడ్యూల్‌ను చిత్రీకరిస్తోంది. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో అందమైన లొకేషన్లలో ఓ విజువల్ ట్రీట్‌లా ఉండే పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నారు. అలాగే ‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కాంతార’, ‘కరుప్పు’ చిత్రాలకు యాక్షన్ కంపోజ్ చేసిన స్టంట్ కొరియో గ్రాఫర్ విక్రమ్ మోర్ డిజైన్ చేస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నారు. హీరోగా నటిస్తూనే దర్శకుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామ్ పోతినేని ఈ షెడ్యూల్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. సినిమా విజన్‌కు తగ్గట్టుగా ప్రతి సన్నివేశాన్ని అత్యున్నత స్థాయిలో తెరకెక్కించేందుకు మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇదొక విభిన్నమైన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. నియో-నోయర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.
ఈ సినిమాకి రచన, దర్శకత్వం: రామ్ పోతినేని, మ్యూజిక్: సామ్ సీఎస్, డీఓపీ : తిరునావుక్కరసు, ప్రొడక్షన్ డిజైనర్: ఎ.ఎస్‌.ప్రకాష్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -