Wednesday, August 5, 2026
E-PAPER
Homeఆటలుశభాష్‌ ఇషా సింగ్‌

శభాష్‌ ఇషా సింగ్‌

- Advertisement -

‌షూటర్‌‌కు శాట్జ్‌ ఎండీ సన్మానం
నవతెలంగాణ-హైదరాబాద్‌
ఇటీవల చైనాలో హాంగ్జౌలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ‌షూటింగ్‌ ‌ప్రపంచకప్‌‌లో పసిడి పతకం సాధించిన భారత స్టార్‌ ‌షూటర్‌ ఇషా సింగ్‌‌ను తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌) ‌వీసీ, ఎండీ సోనీబాలా దేవి అభినందించారు. మహిళల పిస్టల్‌ ‌షూటింగ్‌‌లో సాధించిన పసిడి పతకంతో వచ్చిన ఇషా సింగ్‌‌ను మంగళవారం ఎల్బీ స్టేడియంలోని కార్యాలయంలో సోనీబాలా దేవి శాలువాతో ఘనంగా సన్మానించారు. ‘తెలంగాణ అమ్మాయి వరుసగా రెండు ప్రపంచకప్‌ ఈవెంట్లలో పసిడి పతకాలు సాధించటం గర్వకారణం. భవిష్యత్‌‌లో ఇషా సింగ్‌ ‌మరెన్నో విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి కీర్త ప్రతిష్టలు తీసుకువస్తుందనే నమ్మకం ఉందని’ సోనీబాలా దేవి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -