- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ మేరకు బుధవారం సర్ గంగరామ్ ఆస్పత్రి వైద్య బృందం హెల్త్ రిపోర్టు విడుదల చేసింది. కడుపు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ సంబంధించిన వైద్యులు పరీక్షలు చేశామని, యాంటీబయాటిక్స్ ఇస్తూ ఆమె పరిస్థితిని డాక్టర్ల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని ఆయన చెప్పారు. మంగళవారం రాత్రి అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీలోని సర్ గంగరామ్ ఆస్పత్రిలో ఆమెను అడ్మిట్ చేశారు. తాజాగా ఆమె ఆరోగ్యం మెరుగ్గుగా ఉందని వైద్యులు వెల్లడించారు.
- Advertisement -



