Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళల అభివృద్ధికి సంఘాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రుణ సదుపాయం: జిపి సెక్రెటరీ ప్రవీణ్

మహిళల అభివృద్ధికి సంఘాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రుణ సదుపాయం: జిపి సెక్రెటరీ ప్రవీణ్

- Advertisement -

నవతెలంగాణ మద్నూర్

డోంగ్లి మండల పరిధిలోని ఇలేగావ్ గ్రామంలో మహిళలతో ఆ గ్రామ కార్యదర్శి ప్రవీణ్ ఆ గ్రామ పెద్దలు సర్పంచ్ కుటుంబీకులు ఉప సర్పంచ్ కుటుంబీకులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి ఆ గ్రామ మహిళలతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు కల్పించే అవకాశాల గురించి వివరించారు. మహిళలు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రుణ సదుపాయాలు కల్పిస్తుందని సంఘాలు ఏర్పడాలని కోరారు. ఈ గ్రామంలో మహిళా సంఘాలు ఏర్పడడంలో మహిళలు ముందుకు రావడం లేక ప్రత్యేకంగా సమావేశం పరిచి సంఘాల ఏర్పాటు గురించి అవగాహన కల్పించారు. మహిళా సంఘాల ద్వారా మహిళలకు కల్పించే అనేక రకాల అవకాశాల గురించి వివరించారు. గ్రామ కార్యదర్శి గ్రామ పెద్దలు మహిళలకు సంఘాల ఏర్పాటు గురించి నచ్చ చెప్పడంతో మహిళలు సంఘాలుగా ఏర్పడడానికి ముందుకు రావడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు ఆ గ్రామ కార్యదర్శి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -