- Advertisement -
నవతెలంగాణ మద్నూర్
డోంగ్లి మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల మొఘలో 8వ తరగతి విద్యార్థులకు 7వ తరగతి విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. గత ఏడేండ్లుగా తమతో కలిసి చదువుకొని ఉన్నత విద్య కోసం వేరే పాఠశాలకు వెళ్తున్న తమ సీనియర్లకు ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రధానోపాధ్యాయులు దయానంద్ మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్ పర్సన్ ఉజ్వల ఉత్తం పటేల్, గ్రామ సర్పంచ్, ఉపాధ్యాయ బృందం పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



