Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నటిగా పరిధిని విస్తరించుకుంటున్న ‘ద్రిషికా చందర్’

నటిగా పరిధిని విస్తరించుకుంటున్న ‘ద్రిషికా చందర్’

- Advertisement -

– త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు..

నవతెలంగాణ హైదరాబాద్:

సినీరంగంలోకి దూసుకుపోతున్నారు నటి ‘ద్రిషికా చందర్’. నటనా రంగంలో మరిన్ని మంచి పాత్రలు లభించాలని ఆమె కోరుకుంటున్నారు. న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మక పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ లో చదువుకున్న ఆమె నటిగా మంచి మార్కులు సంపాదించుకున్నారు. అంతేకాదు, ఆమె సమర్థవంతమైన వక్తగానూ రాణిస్తున్నారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ద్రిషికా, అనతి కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని గడించడం విశేషం. ఆమె తెలుగు భాషలో ‘మనసానమః’ షార్ట్ ఫిల్మ్ ద్వారా తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా గిన్నిస్ వర్ల్డ్ రికార్డు సృష్టించింది. 2022లో ఆస్కార్ అర్హత పొందిన ఈ చిత్రంలోని ఆమె నటనకు అంతర్జాతీయ స్థాయిలో నలభైకి పైగా ‘ఉత్తమ నటి అవార్డులు’ పొందడం ఆమె ప్రతిభకు తార్కాణం. అంతేకాదు మనసానమః చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా అవార్డులు కైవసం చేసుకోవడం విశేషం. ఇప్పటికే తెలుగులో నాలుగు, హిందీలో రెండు చలన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆమె మలయాళ చిత్ర సీమలోకి అడుగు పెట్టారు. ఇటీవలే జియో సినిమాలో విడుదలైన హిందీ చలన చిత్రం ‘హే కమీనీ’లో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. తెలుగులో ‘బుచ్చి నాయుడు కండ్రిగ’, ‘ఎ బ్యూటిఫుల్ గర్ల్’ తదితర చిత్రాలతో వెండితెర ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘సుయోధన’ చలన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి వైఎస్ మాధవరెడ్డి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి‌ హీరోగా, సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఆమె నటించిన మరికొన్ని మలయాళ, తెలుగు భాషా చిత్రాలు నిర్మాణానంతర పనుల్లో ఉన్నాయి. వెండి తెరపైనే కాకుండా నాటక రంగంలోనూ ఆమెకు ప్రవేశం ఉంది. ‘ఏవం ఇంద్రజిత్’ అనే హిందీ నాటికలో ఆరు విభిన్న కోణాలున్న మహిళా పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు నివాస్ దర్శకత్వంలో ‘వే 2 న్యూస్’ వంటి ప్రముఖ మొబైల్ యాప్ కోసం చేసిన వాణిజ్య ప్రకటనలతో తన ప్రతిభను చాటుకున్నారు. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు భాషలపై మంచి పట్టున్న ద్రిషికా చందర్, రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.ఆమె తన ఇన్స్టా హాండిల్ @drishikachander ద్వారా అభిమానులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -