జీ స్టూడియోస్ సమర్పణలో నటి,నిర్మాత నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘రాకాస’. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ సినిమాపై ఎక్స్పెక్టే షన్స్‌ను మరింతగా పెంచాయి. ‘ఆ కోటలో ఉన్నది.. ఊరు బలి పంపుతున్నది సామాన్యుడికి కాదు.. భీకర బ్రహ్మ రాక్షసుడికి’ అనే డైలాగ్‌తో ‘రాకాస’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. దానికి అనుగుణంగా చూపించే పురాతనమైన కోట.. బ్రహ్మ రాక్షసుడు ఇవన్నీ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.
భయంతో నడుస్తున్న గెటప్ శీను ఓ పిల్లాడు చేసిన బూర సౌండ్‌కి జడుసుకుంటాడు. వెంటనే ‘నువ్వు పెద్ద డిఎస్పి అనుకుంటున్నావా? లోపలకిపో..కోతి నాయాలా!’ అని తిడతాడు. హీరో సంగీత్ శోభన్, నయన సారికల మధ్య ఉన్న ప్రేమ.. హీరో, హీరోయిన్‌కు మధ్య ఉన్న సీన్స్‌ను చూపిస్తూ వారి మధ్య ఉన్న లవ్ యాంగిల్‌ను రివీల్ చేశారు. బస్సులో సంగీత్, తనికెళ్ల భరణి, గెటప్ శీను మధ్య వచ్చే కామెడీ సీన్ ఆకట్టుకుంటోంది. పోలీస్ ఆఫీసర్ సంగీత్‌ను ఉద్దేశించి ‘రాత్రి ఏం జరిగింది?’ అని అడిగితే..’పడుకోవడం లేటయ్యింది’ అని కామెడీగా సమాధానమిస్తాడు. ‘వేళాకోళంగా ఉందా? నా హిస్టరీ నీకు తెలియదు’ అని బ్రహ్మాజీ సంగీత్‌తో అంటే.. ‘ఏం డిలీట్ చేస్తారా?’ అని ఇచ్చే ఫన్నీ కౌంటర్ ఆకట్టుకుంటోంది.
‘ఊరుకొచ్చినప్పటి నుంచి నా జీవితం ఎటేలుతుందో తెలియటం లేదు’ అని హీరో టెన్షన్ పడటం..దానికి తోడు ట్రైలర్లో చూపించే ఉల్క పతనం..రాత్రికి రాత్రి పశువులు కలేబరాలుగా మారటం చూస్తే ఊర్లో ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఊరు బతికి బయటపడాలంటే బలి పంపాల్సిందే అంటూ తనికెళ్లభరణి చెప్పటం..కోటకు సంబంధించిన తాళాన్ని చూపించటం చూస్తే కోటకు, ఊరుకి మధ్య ఏదో లింకు ఉందనేది అర్థమవుతుంది. ట్రైలర్ చివరలో ‘ఈమాత్రం దానికేనా.. లోపల నీకుంటది అసలైన మ్యూజిక్ అనటంతో..’ బ్రహ్మ రాక్షసుడు ఉండే కోటలోకి హీరో సంగీత్ ఎంట్రీ ఉంటుంది.. ఆ కోటలోకి వెళ్లిన హీరో ఏం చేశాడు? ఊరిని కాపాడాడా? తన ప్రేమను గెలిపించుకున్నాడా? అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 3న రిలీజ్ కానున్న ఈ సినిమా చూడాల్సిందేనని అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రాజు ఎదురురోలు, సంగీతం : అనుదీప్ దేవ్, ఎడిటర్ : అన్వర్ అలీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమేష్ మన్యం, కొరియోగ్రఫీ : జెడి, భాను, ఆర్ట్ డైరెక్టర్ : విష్ణు వర్ధన్ పుల్లా.
అంచనాలు రెట్టింపు చేసిన ‘రాకాస’ ట్రైలర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



