కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజ రముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘యూత్’. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్‌ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 27న ఈ మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ‘కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ – నో ఏజ్ లిమిట్’ అనే స్లోగన్‌తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. తాజాగా ఈచిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరోలు శ్రీ విష్ణు, సత్యదేవ్, డైరెక్టర్స్ సాయి రాజేశ్, వశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ మీనాక్షి దినేష్ మాట్లాడుతూ, ‘ఈ మూవీ తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులు కూడా హిట్ చేస్తారనే నమ్మకం ఉంది. కథను నమ్మి, కష్టపడి మేమంతా ఈ సినిమాకు వర్క్ చేశాం. ఈ చిత్రం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది. మీ లైఫ్‌లోని కూల్ మూవ్మెంట్స్, మీ లవ్, స్ట్రగుల్స్, ఫ్రెండ్షిప్ అన్నీ ఈ సినిమాతో రిలేట్ చేసుకుంటారు. మీ మనసులో నిలిచిపోయే సినిమా అవుతుంది’ అని తెలిపారు. ‘తమిళంలో మా సినిమాకు దక్కిన విజయమే తెలుగులోనూ ప్రేక్షకులు అందిస్తారని ఆశిస్తున్నాం’ అని హీరోయిన్ ప్రియాన్షి యాదవ్ చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో నేను ఒక పాట పాడాను. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్‌లో నేనూ పార్ట్ కావడం సంతోషంగా ఉంది’ అని తెలిపారు. ‘మనం చూసిన ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల వెనక వినీత్, సందీప్ ఉన్నారు. వారి ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉన్నాయి. యూత్ సినిమాతో వీళ్లకు ప్రొడ్యూసర్స్‌గా మంచి సక్సెస్ రావాలి. ఈ సినిమాలో ఫన్, ఎంటర్టైన్మెంట్తో పాటు మనందరికీ నచ్చే ఒక మంచి ఎమోషన్ ఉంది’ అని డైరెక్టర్ వినయ్ రత్నం చెప్పారు.
ప్రొడ్యూసర్ సందీప్ మాట్లాడుతూ, ‘టాలీవుడ్లో ఎంతోమంది మాకు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ వేదిక మీద నిలబడ్డాం. ఈ సినిమా ఆల్రెడీ తమిళంలో పెద్ద సక్సెస్ సాధించింది. 4 రోజుల్లో 30 కోట్ల రూపాయల వసూళ్లు దక్కించుకుంది. బుక్ మై షో లో టికెట్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి. తెలుగులో కూడా అలాంటి సక్సెస్ దక్కుతుందనే ఆశిస్తున్నాం. దీన్ని ఒక తెలుగు స్ట్రైట్ సినిమాలా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాం. వినీత్ ఈ వర్క్స్ అన్నీ చూసుకుంటూ వచ్చాడు. యూత్, లవర్స్ మాత్రమే కాదు పేరెంట్స్‌తో కూడా కలిసి చూడాల్సిన చిత్రమిది’ అని చెప్పారు. ‘ఈ సినిమాను ఒక్కరే చూస్తే బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ తో కలిసి చూస్తే ఇంకా బాగుంటుంది, మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో థియేటర్స్ కు వెళ్తే మరింత ఎంజాయ్ చేస్తారు’ అని ప్రొడ్యూసర్ వినీత్ అన్నారు.
తెలుగులోనూ విజయం ఖాయం
- Advertisement -
- Advertisement -



