Thursday, March 26, 2026
E-PAPER
Homeజిల్లాలుస్కాలర్షి షిప్పుల కోసం పి.డి.ఎస్.యూ. బంద్

స్కాలర్షి షిప్పుల కోసం పి.డి.ఎస్.యూ. బంద్

- Advertisement -

బకాయిలు విడుదల చేయకపోతే సీఎం ఇంటి ముట్టడి

నవతెలంగాణ – ఆలేరు రూరల్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో విద్యార్థులు బంద్ నిర్వహించారు. బకాయిలు విడుదల చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మామిడాల ప్రవీణ్, ఆర్.ఉదయ్ హెచ్చరించారు.

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిగ్రీ, పీజీ,ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీల బంద్‌లో భాగంగా ఆలేరు ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు మూతపడ్డాయి. అనంతరం విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి,అక్కడ ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్పులు, రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ.10,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అధికారంలోకి రాగానే బకాయిలన్నీ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, రెండున్నర సంవత్సరాలు గడిచినా వాటిని అమలు చేయలేదని విమర్శించారు.

స్కాలర్ షిప్పులు అందకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,చదువు పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలు ఫీజులు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. దీనివల్ల విద్యార్థులు ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.విద్యారంగానికి తగిన నిధులు కేటాయించకుండా, ఇచ్చిన హామీలను విస్మరించిందని ప్రభుత్వంపై ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌కు బకాయి ఉన్న రూ.218 కోట్లు చెల్లించాలని, విద్యారంగానికి కనీసం 30% బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టి సీఎం నివాసం, అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి.వై.ఎల్ రాష్ట్ర నాయకులు మేజాడి కుమార్, ఆకుల కృష్ణ, పి.డి.ఎస్.యూ నాయకులు తమ్మడి చరణ్, మామిడాల భాను, కళ్లెపు ప్రణయ్, నరసింహారెడ్డి, కమలేష్, దుర్గాప్రసాద్, విశాల్, సంధ్య, వైష్ణవి, బన్నీ, వరప్రసాద్, మాధురి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -